వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడ మండలం లంకెలపాలెం బ్రిడ్జి సమీపంలోని రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య సుమారు 20 ఏళ్ల గుర్తుతెలియని యువకుడి మృతదేహం గురువారం లభ్యమైంది. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు.
మృతుడు తెలుపు టీషర్ట్, నలుపు నిక్కర్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్‌టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

