Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు భారీగా కాంప్లెక్స్‌ ఎరువుల రాక

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 11:28 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
జిల్లాకు భారీగా కాంప్లెక్స్‌ ఎరువుల రాక - Udayam
చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు సోమవారం 1,337.450 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు చేరినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. ఇందులో 319.250 టన్నుల అమ్మోనియం సల్ఫేట్‌, 1,018.200 టన్నుల 20.20.00.13 ఎరువులు ఉన్నాయి. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు కేటాయించారు. కొంత మొత్తాన్ని బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేసినట్లు అధికారి తెలిపారు.

Comments

G
Loading comments...