Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీలు ఆదాయ వనరులపై దృష్టి సారించాలి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 10, 2026 3:56 PM హన్మకొండ General
పంచాయతీలు ఆదాయ వనరులపై దృష్టి సారించాలి - Udayam
గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. హనుమకొండ జిల్లా దామెరలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని, వనమహోత్సవానికి సిద్ధం కావాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...