Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవే లైట్ల విద్యుత్ బిల్లులపై పంచాయతీల ఆందోళన

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 11:44 AM బాపట్లGeneral
హైవే లైట్ల విద్యుత్ బిల్లులపై పంచాయతీల ఆందోళన - Udayam
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ విద్యుత్ బిల్లులను పంచాయతీలే చెల్లించాలని నోటీసులు రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారం గుత్తేదారుదేనని వారు అంటున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో పలు చోట్ల లైట్లు వెలగడం లేదు. దీంతో రాత్రివేళ ప్రమాదాల ముప్పు పెరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరించాలని పంచాయతీ అధికారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...