Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో జోరందుకున్న పాలమూరులో వరి నాట్లు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 3:55 PM మహబూబ్‌నగర్General
వర్షాలతో జోరందుకున్న పాలమూరులో వరి నాట్లు - Udayam
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద చేరుతుండటంతో కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమ ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తున్నారు. శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటి విడుదలకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు వరి నాట్లు జోరుగా చేపడుతున్నారు.

Comments

G
Loading comments...