వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామ పంచాయతీ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ఆయన పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఫిబ్రవరిలోపు నిర్మాణ పనులను పూర్తి చేసి జూన్ నుండి నూతన అడ్మిషన్లు ప్రారంభమయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

