Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారన్నవలసలో రాకపోకలకు కర్రల వంతెన

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 10:38 AM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు మండలంలోని పారన్నవలస వద్ద మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేగావతి నది, కూరగెడ్డ పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్థులు గురువారం కర్రలు, చెక్కలతో తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసుకున్నారు. 2023లో ప్రారంభమై అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన పిల్లర్లపైనే ఈ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...