Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 4:41 PM శ్రీకాకుళంGeneral
పాముకాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి - Udayam
జలుమూరు మండలం గొల్లపేటకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని అనుష్క (17) పాముకాటుతో శనివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం పొలం పనులు చేస్తున్న కుటుంబీకులకు తాగునీరు అందించేందుకు పొలం గట్లపై వెళ్తుండగా విషసర్పం కాటేసింది. స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...