Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాము కాటుతో మహిళ మృతి

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 6:56 PM శ్రీకాకుళంGeneral
పాము కాటుతో మహిళ మృతి - Udayam
నరసన్నపేట మండలం బాడాం గ్రామానికి చెందిన చల్ల రాములమ్మ (45) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. బాడాం జడ్పీ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న రాములమ్మ గత నెల 25న తన ఇంట్లో పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసింది. పోలీసులు వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...