వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ మండలం నూతన ఉప తహశీల్దార్గా చింతలపూడి రమేశ్ బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన సీతంపేట మండలం ఉప తహశీల్దార్గా విధులు నిర్వహించారు.
బదిలీపై పాలకొండకు వచ్చిన ఆయన ప్రజల రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన రమేశ్ బాబుకు రెవెన్యూ సిబ్బంది, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

