వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బాహ్యవలయ రహదారిపై ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధతో పనిచేసే మల్టీ వయోలేషన్ డిటెక్షన్ సిస్టమ్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు.
శంషాబాద్ నుంచి మేడ్చల్ వరకు గల 14 సమస్యాత్మక ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. అతివేగం, అడ్డదిడ్డంగా లేన్లు మారడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఇవి గుర్తిస్తాయి.
Comments
Loading comments...

