వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు (జులై 13) రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల సుమారు 96.81 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీలు, జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
రక్తహీనత, పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు ఈ మాత్రలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. పిల్లలు ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేసిన తర్వాతే ఈ టాబ్లెట్లను తీసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...