Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు సవరణ నోటీసులకు త్వరగా స్పందించాలి

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 1:03 PM వికారాబాద్General
ఓటరు సవరణ నోటీసులకు త్వరగా స్పందించాలి - Udayam
కొడంగల్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి మాట్లాడారు. ఓటర్ల సవరణ నోటీసులు అందిన వారు ఆలస్యం చేయకుండా స్పందించాలని సూచించారు. ఎనిమిది మండలాల్లో 81,403 మందికి గాను 80 వేలకు పైగా నోటీసులు అందజేశామని తెలిపారు. ఇప్పటివరకు 67 వేల మంది వివరాలు ఇచ్చారని, ప్రక్రియ విజయవంతానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...