Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క విద్యార్థి.. ఒక్కరే టీచర్.

శిరీష గౌడ్ Jul 18, 2026 12:56 PM వరంగల్about 2 hours ago
వరంగల్ జిల్లా కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో ఈ బడి వార్తల్లో నిలిచింది. ఇక్కడ రెండో తరగతి చదువుతున్న విక్కీపాల్ అనే బాలుడి కోసం టీచర్ జగన్మోహన్‌రావు రోజూ విధులకు హాజరవుతున్నారు. కోనాపురం గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడంతో మిగతా 19 మంది విద్యార్థులు వేరే పాఠశాలకు మారారు. ప్రస్తుతం ఈ ఏకైక చిన్నారి కోసమే ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూ, మధ్యాహ్న భోజనం వండిస్తున్నారు.

Comments

G
Loading comments...