Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 18, 2026 2:08 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందని, అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను చిత్తుకాగితం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేవు కానీ లూటీఫికేషన్లు సాగుతున్నాయని ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...