Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమ్మంగిలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు

Follow Udayam on Google
Sathish Sep 25, 2026 10:03 AM కాకినాడGeneral
ఒమ్మంగిలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు - Udayam
ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో భారీ వర్షాల ధాటికి వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పూడిక తొలగించకపోవడం వల్లే పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...