వార్తలకు తిరిగి వెళ్లండి

2036 లేదా 2040 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా.. వేదికగా డర్బన్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. 2010 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో డర్బన్‌పై ఆసక్తి చూపుతోంది.
అయితే ఒలింపిక్స్ నిర్వహణకు అయ్యే భారీ వ్యయం గతంలో అడ్డంకిగా మారింది. 2022 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యాన్ని కూడా ఆర్థిక కారణాలతో డర్బన్ కోల్పోయింది.
Comments
Loading comments...

