Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల దేశవాళీ టీ20ల్లో ఢిల్లీ ప్రపంచ రికార్డు!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 10:55 AM జాతీయంక్రీడలు
మహిళల దేశవాళీ టీ20ల్లో ఢిల్లీ ప్రపంచ రికార్డు! - Udayam
మహిళల దేశవాళీ టీ20ల్లో ఢిల్లీ జట్టు అత్యధిక స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 6 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఓపెనర్‌ తనీషా సింగ్‌ 47 బంతుల్లో 119 పరుగులతో చెలరేగింది. 38 బంతుల్లోనే శతకం పూర్తి చేసి మహిళల టీ20ల్లో మూడో వేగవంతమైన సెంచరీ సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులే చేసింది.త్రిష (80) పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది.

Comments

G
Loading comments...