వార్తలకు తిరిగి వెళ్లండి
హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు-నాగమణి జంట హత్యల కేసులో సీబీఐ దర్యాప్తును తీవ్రతరం చేసింది. విచారణలో భాగంగా మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు పుట్ట మధుకర్‌ను అధికారులు రెండోసారి ప్రశ్నించారు.
రామగుండం కమిషనరేట్‌లో ఆయన స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు 140 మందికి పైగా విచారించింది.
Comments
Loading comments...

