Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవతలంలో 100 ఎకరాల వరి నీటమునుక

Follow Udayam on Google
Raghu Sep 25, 2026 2:24 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
నవతలంలో 100 ఎకరాల వరి నీటమునుక - Udayam
మహేంద్ర తనయ నది వరదతో సారవకోట మండలం నవతల రెవెన్యూ పరిధిలో సుమారు 100 ఎకరాల వరి పైరు నీటమునిగింది. వంశధారలో కలిసే మహేంద్ర తనయకు వరదనీరు పోటెత్తడంతో పొలాల్లోకి నీరు చేరింది. చేతికొచ్చిన పంట నీటమునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం భారీగా ఉంటుందని, అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...