వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా అగ్మీరా హనుమాన్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్లిన జె. స్వామి స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు హనుమాన్ దాస్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడంతో పాటు సరఫరా అంతరాయాలను త్వరగా పరిష్కరిస్తామని హనుమాన్ దాస్ తెలిపారు.
Comments
Loading comments...

