వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో ఈసారి సీతాఫలాల విక్రయాలు తగ్గాయి. ఏటా శీతాకాలానికి ముందే కొత్తగూడ, గంగారం ప్రాంతాల నుంచి వ్యాపారులు సీతాఫలాలను తీసుకొచ్చి విక్రయించేవారు. అయితే, ఈ ఏడాది మార్కెట్లో సీతాఫలాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి.
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో సీతాఫలాల సందడి తగ్గింది.
Comments
Loading comments...

