వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సిల్ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి ఈ ఎన్నికలు ఎంతగానో దోహదపడతాయని HM ప్రేమ్ చంద్ తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలను విద్యార్థి దశ నుంచే అలవర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

