Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మా ఉద్యోగి ఘటనపై CITU డిమాండ్‌

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:52 PM అనకాపల్లి General
ఫార్మా ఉద్యోగి ఘటనపై CITU డిమాండ్‌ - Udayam
సేజి నోవోపోర్‌ ఫార్మాలో కెమిస్ట్‌ పి. నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడటంపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌. రాము, మండల కన్వీనర్‌ కె. సోమునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి యాజమాన్యం తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని, పరిశ్రమలో కార్మికులపై పని భారం తగ్గించి ప్రశాంత వాతావరణం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...