Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి గైర్హాజరైన ఐదుగురికి నోటీసులు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 10:57 AM నల్గొండGeneral
ప్రజావాణికి గైర్హాజరైన ఐదుగురికి నోటీసులు - Udayam
ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణికి గైర్హాజరైన ఐదుగురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆదేశించారు. కట్టంగూర్‌లో ఒకరు, నిడమనూరులో ముగ్గురు, త్రిపురారంలో ఒకరు విధులకు గైర్హాజరయ్యారు. ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 190 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. విధులకు గైర్హాజరైన అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Comments

G
Loading comments...