వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం కొత్త కోనేరు చెరువు గట్టు ఆక్రమణలకు సంబంధించి 76 మందికి నోటీసులు జారీ చేసినట్లు తహశీల్దార్ వి.రాజేశ్వరరావు తెలిపారు. సర్వే నంబర్ 306లోని 10.84 ఎకరాల చెరువులో సుమారు 3 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.
ఇప్పటికే కొన్ని ఆక్రమణలను తొలగించారు. ఇంకా 2.15 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేసినట్లు శుక్రవారం తెలిపారు
Comments
Loading comments...

