వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లి పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్ హియరింగ్ ప్రక్రియను స్థానిక ఎంపిఓ మధుసూదన్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం ఆయన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.
అనంతరం అక్కడే నిర్వహిస్తున్న సర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్ నోటీసులు వచ్చిన వారు ధృవపత్రాలను తప్పకుండా ఇవ్వాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

