వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లి శివారులోని నల్లవాగు మత్తడి ఉధృతంగా పొంగిపొర్లుతోంది.
పాలనురగలా జాలువారుతున్న నీరు మంజీరా నదిలోకి పరవళ్లు తొక్కుతూ జలకళను సంతరించుకుంది.
జాతీయ రహదారి పక్కనే ఈ అద్భుత ప్రవాహం ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు అక్కడ ఆగి వరద అందాలను వీక్షిస్తూ ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ప్రవాహానికి సమీపానికి వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

