వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 నకిలీ బంగారు ఉంగరాలు, 35.8 గ్రాముల బరువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎస్.రాజ్ కుమార్ తెలిపారు.
వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

