Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్‌లో 13.161 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 9:58 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్‌లో 13.161 టీఎంసీల నీటి నిల్వ - Udayam
నిజాంసాగర్‌ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం నీటిమట్టం 1401.57 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.161 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...