వార్తలకు తిరిగి వెళ్లండి
బ్రిటన్‌కు నిజామాబాద్ బియ్యం

భారత్-యూకే వాణిజ్య ఒప్పందంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి బ్రిటన్‌కు బియ్యం ఎగుమతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గజానన్ రైస్ మిల్లుకు చెందిన 24.1 మెట్రిక్ టన్నుల సోనామసూరి బియ్యం లోడ్ వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సరుకు విశాఖపట్నం పోర్టు ద్వారా సముద్ర మార్గంలో యూకేకు చేరనుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వీరాస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...