వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ గ్రామీణ మండలం తిర్మన్‌పల్లికి చెందిన తోట శ్రీనివాస్ బహ్రెయిన్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో నీట మునిగి మృతిచెందారు. ఏడేళ్ల కిందట ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన ఆయన అక్కడ ఉద్యోగం చేస్తూ పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు.
శ్రీనివాస్ మరణవార్తతో స్వగ్రామంలోని ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని త్వరలోనే స్వగ్రామానికి తీసుకురానున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
Comments
Loading comments...

