వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎక్కువ విస్తీర్ణంలో పైకప్పులు వేసి ఆర్థికంగా నష్టపోతుండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో స్లాబ్ వైశాల్యాన్ని గరిష్ఠంగా 750 చదరపు అడుగులకే పరిమితం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ నిబంధన కొత్తగా నిర్మించే ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందని హనుమకొండ జిల్లా అధికారి సిద్ధార్థనాయక్ తెలిపారు. లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

