వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కారు ప్రమాదం నుండి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా, కామారెడ్డి జిల్లా బిక్కనూర్ వద్ద వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు డివైడర్‌పైకి దూసుకెళ్లి సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, గణేశ్ గుప్తా మరియు ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

