Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర సరకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి: సోషలిస్ట్ పార్టీ

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 7:32 PM విజయనగరంGeneral
నిత్యావసర సరకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి: సోషలిస్ట్ పార్టీ - Udayam
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను ప్రభుత్వం నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.శ్రీనివాసరావు కోరారు. విజయనగరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బియ్యం, పంచదార తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ధరలను అదుపులోకి తీసుకురావాలని కోరారు.

Comments

G
Loading comments...