వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యను నిరసిస్తూ నిర్మల్ లో ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలిపారు. మంచిర్యాల చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
Comments
Loading comments...

