Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ సరస్వతీ కాలువ ద్వారా సాగునీరు విడుదల రైతన్నల హర్షం KSR కు సన్మానం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 6:42 AM నిర్మల్General
నిర్మల్ సరస్వతీ కాలువ ద్వారా సాగునీరు విడుదల రైతన్నల హర్షం KSR కు సన్మానం - Udayam
సరస్వతి కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకుని రైతుల ప్రయోజనాల కోసం కృషి చేసిన నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు కు మామడ మండల రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మామడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో శ్రీహరిరావు నివాసానికి చేరుకుని ఆయనను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...