Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఎప్పుడు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:21 AM నిర్మల్General
నిర్మల్ పట్టణంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఎప్పుడు - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హులైన పేదలకు అందజేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపిక నిర్మల్ పట్టణంలో ఎప్పుడూ అంటూ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రెండో విడత లో 42 వార్డులలో ఉన్న అర్హుల వివరాలను సేకరించిన పురపాలక , గృహ నిర్మాణ శాఖల అధికారుల 92 మందిని అర్హులుగా ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఎంపికైన లబ్ధిదారులకు కనీసం సమాచారం కూడా లేదని వారు వాపోతున్నారు.

Comments

G
Loading comments...