Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో మూడు ఇళ్లలో చోరీ

Follow Udayam on Google
సందీప్ Jul 22, 2026 12:42 PM నిర్మల్ క్రైమ్
నిర్మల్ లో మూడు ఇళ్లలో చోరీ - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ ఎస్సీ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. లింగన్న, సునీత, లక్ష్మి ముగ్గురి ఇళ్లలో చోరీ జరిగిందన్నారు. ఎల్ఐసి కార్యాలయంలో పనిచేస్తున్న లింగన్న ఇంట్లో కమ్మలు, బుట్టలతో పాటు కొంత నగదు,సునీత ఇంట్లో 6 గ్రాముల బంగారం, పది తులాల వెండి, లక్ష్మి ఇంట్లో ఏడు గ్రాముల బంగారం, 8 తులాల వెండి, 4 వేల రూపాయల నగదును దుండగులు అపహరించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...