వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ లోని ప్రియదర్శిని నగర్ అయోధ్యపురి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. మహిళల కోలాటాలు, నృత్యాలు, భక్తుల జయజయధ్వానాలతో నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగాయి. చిన్నారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులను అలరించాయి.
గణనాథుడి నిమజ్జనం సందర్భంగా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
Comments
Loading comments...

