వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకింగ్ మోసాల కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అంతర్జాతీయంగా అన్ని దారులూ మూసుకుపోయాయి. తాజాగా ఫ్రాన్స్‌లోని యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR)లో ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు పూర్తిగా తిరస్కరించింది.
ఇప్పటికే యూకే హైకోర్టు సైతం భారత్‌కు అప్పగించకుండా రక్షణ కల్పించాలన్న ఆయన వినతిని తోసిపుచ్చింది. ఈ వరుస చట్టపరమైన చుక్కెదుర్ల నేపథ్యంలో, అధికారులు త్వరలోనే నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురానున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Loading comments...

