వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో శుక్రవారం ఉదయానికి నీటిమట్టం 17.5 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా,నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల నిలిపివేశారు.
వారం రోజుల క్రితం 17.5 ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకారణంగా వచ్చిన వరదతో జలాశయం పెరుగుతూ, తగ్గుతు నిలకడగ ఉంది. ప్రస్తుతం జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

