వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని కాంచీపురం వర్సిటీలో తిరుపతికి చెందిన ఈసీఈ విద్యార్థిని నిఖిత(20) హాస్టల్ గదిలో మృతి చెంది కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిఖిత మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలంలో లేఖ లభించిందని, మృతికి దారితీసిన కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

