వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం నీటిమట్టం 1,400.61 అడుగులకు చేరిందని ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం 12.027 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు.
పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

