Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి గుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:33 AM వరంగల్General
నీటి గుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి - Udayam
మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కాకులబోడుతండాలో నీటి గుంటలో పడి బోడ అక్షిత్‌కుమార్‌ (9) మృతిచెందాడు. మరిపెడ బంగ్లాకు చెందిన బాలుడు దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి మట్టి తీయడంతో ఏర్పడిన గుంటలో వర్షపు నీరు చేరింది. బుధవారం అందులోకి దూకిన బాలుడు ఈత రాక మునిగిపోయాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...