Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌-పీజీ పరీక్షల నిర్వహణపై డిఆర్‌వో సమీక్ష

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 7:23 PM గుంటూరుGeneral
నీట్‌-పీజీ పరీక్షల నిర్వహణపై డిఆర్‌వో సమీక్ష - Udayam
జిల్లాలో నీట్‌-పీజీ-2026 పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని డీఆర్‌ఓ ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆరు కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...