వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి సమీపంలోని టెక్రియాల్ చెరువు బ్రిడ్జి వద్ద హై వే-44పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. అనంతపూర్ నుంచి ఢిల్లీకి టమాట లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో బబ్లు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

