Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీల్లో సరికొత్త పథకం

హరిక శర్మ Jul 16, 2026 10:20 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
అంగన్‌వాడీల్లో సరికొత్త పథకం - Udayam Digital
తెలంగాణవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో వచ్చే నెల నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భద్రాద్రి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పథకం విజయవంతమైందని ఆమె తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గుడ్లు, పాల సరఫరాలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...