వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పరిధిలో కొత్తపేటకు చెందిన వైద్యుడు డి.ఉదయ్ కుమార్‌ను సైబర్ నేరగాళ్లు మోసగించారు. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా సంప్రదించి ఐపీఓలు, స్టాక్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
నకిలీ యాప్‌లో లాభాలు చూపించి 59 లావాదేవీల ద్వారా రూ.1.49 కోట్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

