Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం జవాన్‌కు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పతకం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:48 AM మహబూబాబాద్ General
కొత్తగూడెం జవాన్‌కు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పతకం - Udayam
కొత్తగూడెం మండలం పెగడపల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ బొల్లు వినయ్‌ యాదవ్‌ అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటారు. హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో ఈ నెల 26, 27న జరిగిన 12వ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు. దేశ సేవతో పాటు క్రీడల్లోనూ రాణించిన వినయ్‌ విజయం పలువురిని ఆకట్టుకుంది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సాధించిన విజయం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...